శ్రీ ఆచార్య పీఠం

   వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం

| సత్యం తపః | ధర్మం తపః |  కర్తవ్యం తపః |

శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యమ్ ధర్మరక్షకమ్

హిమాలయే కైలాస పర్వత పూర్వభాగేస్థిత  అవ్యక్తామ్నాయ శ్రీ మహాశక్తి పీఠ సాంప్రదాయిక శ్రీ షోడశీ మహావిద్యాపీఠమ్ 

మహా శాక్తాచార్యుల పరిచయము 

శ్రీమత్ శాక్తానంద పరమహంస పరిప్రాజకాచార్యవర్యులు  సర్వమంత్రతంత్ర నిగమాగమ మహాతంత్రాచార్యులు నిగ్రహానుగ్రహాత్మకులు శాక్తయోగనుష్ఠాన నిష్టాగరిష్ఠులు సనాతన ధర్మ ప్రచారకులు సర్వతంత్ర స్వతంత్రులు పరం తేజో స్వరూపులు మానస సరోవర తీరవిహారులు  మహాశాక్త సాంప్రదాయ పరిరక్షణాచార్యులు షోడశీ మహావిద్యాపీఠ ప్రతిష్టాపనాచార్యులు ప్రకృత కలియుగ 170వ మహాశాక్తాచార్య పదాధిష్టితులు  అనంత శ్రీ విభూషిత శివయతి మహాశాక్త కులాధీశ్వర పరమ పూజ్య శ్రీమన్మహాశాక్త పరఃబ్రహ్మానంద మహాస్వామి వారి పాద పద్మారాధకులైన శ్రీమత్ శాక్తానంద పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు సర్వ తంత్ర స్వతంత్రులు షోడశీ మహా విద్యా పీఠ వ్యవస్థాపకులు మహాశాక్త ధార్మిక సంస్థానాధీశ్వరులు ప్రకృత కలియుగ 171వ మహాశాక్తాచార్య  పదాధిష్టితులు అనంత శ్రీ విభూషిత శివయతి మహాశాక్త కులాధీశ్వర పరమ పూజ్య శ్రీ భైరవానంద మహాస్వామివారు మా గురుదేవులు. 

స్వస్తి శ్రీ రక్షాక్షి నమ సంవత్సర మార్గశీర్ష బహుళ అమావాస్య నాడు మానస సరోవర తీరమందు యోగారుఢులై సూక్ష్మశరీరగతులైన శ్రీవారిని వారి గురుదేవులు తమ స్వహస్తాలతో శాక్త సాంప్రదాయ విధివిధానమున యతి ధర్మము నందు ప్రవేశపెట్టినారు 

నాటి నుండి శ్రీవారు శాక్త ధర్మ ప్రచారము చేయుచున్నారు. స్వభాను నామ సంవత్సర ఉగాది పర్వదినమున మహాశాక్త సాంప్రదాయపు 171వ మహాశాక్తాచార్య  పదాధిష్టితులుగా శ్రీవారు నియమించబడినారు. 2002వ సంవత్సరమున విశాఖపట్టణ ఎండాడ గ్రామము నందు శక్తి పంచాయతన యాగము నిర్వహించినారు. 2004వ సంవత్సరమున సహస్ర చండీయాగము నిర్వహించినారు. శ్రీకాకుళము నందు రుద్రకోటేశ్వరాలయము నందు శివలింగ పునః ప్రతిష్ఠతో సహా అనేక ఆలయ ప్రతిష్టలు శ్రీవారి చేతుల మీదుగా జరిగినవి. 

ఆర్ష ధర్మ పరిరక్షణ-ప్రచారము, సనాతన శాక్త ధర్మ పరిరక్షణ-ప్రచారమే ధ్యేయముగా శ్రీపాదులు జీవనము సాగించుచున్నారు. అనవసర బాహ్యాడంబరములకు తావీయకుండా ధర్మమార్గానుసరణమే జీవన లక్ష్యముగా శ్రీపాదులు కొనసాగించుచున్నారు. యదార్ధమైన ఆర్తితో వచ్చినవారికి శాక్త ధర్మమును, శాక్త యోగ విధానములను బోధించుట యనెడి కర్తవ్యదీక్షా బద్ధులైయున్నారు. విజయనగరం జిల్లా యందలి వింధ్యవాసి గ్రామము నందు ఆశ్రమము స్థాపించి నిత్యానుష్టానము ఆచరించుచున్నారు